
నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ – ఎమ్మెల్యే కె.పి.వివేకానంద..
రూ.1.75 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరి గుట్ట దేవమ్మ బస్తీకి చెందిన వై.రమేష్ మరియు సూరారం కాలని ఎన్టీఆర్ నగర్ కు చెందిన డి.సునంద ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కాగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సదరుకుటుంబానికి భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద దరఖాస్తు చేయించి రూ.1.75 లక్షలు మంజూరు చేయించారు. సంబంధిత చెక్కును ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో 129 డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, 126 డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, 130 డివిజన్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, వార్డు సభ్యురాలు ఇంద్రా రెడ్డి, మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..
