Spread the love

కేంద్ర బడ్జెట్ కు నిరసనగా ఫిబ్రవరి 10 న ఇంద్ర పార్క్ ధర్నా కు………. ప్రజా సంఘాల పిలుపు


వనపర్తి
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లకు బడా బాబులకు అనుకూలంగానూ నిరుపేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని అందుకే కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ ఫిబ్రవరి 10న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునివ్వడం జరిగిందని ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణప్రజాసంఘాల పోరాట వేదిక జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కన్వీనర్ పుట్ట ఆంజనేయులు పాల్గొని మాట్లాడుతూ కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు రైతు కూలీలకు అసంఘటిత కార్మికులకు అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగాను కార్పొరేట్ సంస్థలకు బడా బాబులకు అనుకూలంగా 100% విదేశీ కార్పొరేట్ల చేతుల్లోకి నెట్టేసిందని ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని ఇలా దేశ ప్రజల భవిష్యత్తును విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టడం దేశభక్తి కాదని అన్నారు ముఖ్యంగా 11 సంవత్సరాలుగా నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ధర్నాకు జిల్లాలోని కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు విద్యార్థులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ లక్ష్మి ఐద్వా జిల్లా అధ్యక్షులు సాయి లీల ఐదవ ఉపాధ్యక్షులు ఉమా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం పరమేశ్వర చారి డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జి మహేష్ కెవిపిఎస్ నాయకులు ఎల్ బిసన్న తదితరులు పాల్గొన్నారు