
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును అడ్డుకుంటాం: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాదు ఫ్లయిట్ మోడ్ సీఎం అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గత 15 నెలల్లో 40 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సాధించు కొచ్చింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోందా లేదా ఢిల్లీ కేంద్రంగా నడుస్తోందా అని నిలదీశారు.
ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ తీసుకోవాలని అన్నారు.రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని జామా మసీద్‌లో ఏర్పాటు చేసిన దావత్ – ఏ – ఇఫ్తార్ లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , బాన్సువాడ వైస్ చైర్మన్ జుబైర్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా కొట్లాడటానికి బీఆర్‌ఎస్ పార్టీ ముందుం టుందని తేల్చిచెప్పారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో ఒక్కటంటే ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో నెలకు ఒకటి చొప్పున మత ఘర్షణలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు.
కానీ ముఖ్యమంత్రి ఏ ఒక్కరోజు ఈ ఘటనలపై సమీక్షించడం లేదని, జైనూర్ లో మూడు నెలలు ఇంటర్నెట్ బంద్ పెట్టారని, అక్కడ హిందూ ముస్లింల ఇండ్లను దహనం చేసినా ముఖ్యమంత్రికి వాటిపై సమీక్షించేంత తీరిక లేదని విమర్శించారు.బాధితులకు కనీసం పరిహారం ఇవ్వలేద ని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఎండగట్టారు.
తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికి మంచి చేయాలనే సంకల్పంతో కేసీఆర్ పని చేశారు. ఆ సోయి ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి లేదు. ముస్లింలకు ఇచ్చే రంజాన్ తోఫాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ పెట్టడం దారుణం. మైనార్టీల కోసం పెట్టిన బడ్జెట్ లో 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయ లేదు.
ముస్లిం యువత, మహి ళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్ర మాలు తీసుకువచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
