
నేను BRSలోనే ఉన్నా: బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
TG: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై గద్వాల BRS ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ‘కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు. నా ఫొటోను మార్ఫింగ్ చేసి, కాంగ్రెస్ నేతలతో ఉన్నట్లు చిత్రీకరించారు. నా ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే నేను BRSలోనే ఉన్నానని తెలుస్తుంది’ అని ఆయన సుప్రీంకోర్టుకు అందజేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు.
