Spread the love

లేడీ అఘోరి గా చలామణి అవుతున్న అల్లూరి శ్రీనివాస్

మాయమాటలు చెప్పి అమ్మాయిని ఎత్తుకెళ్లిన అఘోరి

గుంటూరు జిల్లా :
తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరి హల్‌ చల్‌ చేస్తోంది.. కొన్ని చోట్ల ప్రతిఘటన కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు

వర్షిణి అనే అమ్మాయి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీ సులకు ఫిర్యాదు చేశారు. అఘోరి తమ కూతురుని కిడ్నాప్ చేసిందని, అమ్మాయి తండ్రి కోటయ్య ఆరోపించారు.

తన కూతురు శ్రీ వర్షిణికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని గుంటూరు జిల్లా మంగళ గిరికి చెందిన తురిమెల్ల కోటయ్య.. మంగళగిరి సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే, ఇంజినీరింగ్ చదువుతున్న తన కుమార్తె నాలుగు నెలలక్రితం లేడీ అఘోరి మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బట్టలు లేకుండా హల్చల్ చేస్తుంటే.. పోలీసు వారు ఎవరైనా మహిళలు ఉంటే కొంచెం లేడి అఘోరికి బట్టలు కప్పండి అని చెప్పిన తర్వాత.. తమ కూతురు ధైర్యంతో వెళ్లి బట్టలు కప్పిందన్నారు.

అప్పటి నుంచి తన కూతురు ఫోన్ నెంబర్ తీసుకొని అఘోరీ మాట్లా డున్నారన్నారు.. కొంతకా లం గడిచిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చి నా కూతుర్ని మాయమాటలతో మోసం చేసి ఆకుపసరుతో లేపనాలు పూసి, వశీకరణ చేసుకొని అఘోరీల ఆశ్రమానికి యువరాణిని చేస్తారని చెప్పి తన కూతుర్ని పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడని వాపోయాడు..

ఇప్పుడు తన కూతురు తమ మాట వినటం లేదని లేడీ అఘోరి బ్రమలో ఉన్నదని చెప్పారు.. తమ కుమార్తెను కాపాడాలని పోలీసులకి చెప్పినా కేసు నమోదు చేయటం లేదన్నారు. ఆమె తండ్రి కోటయ్య ఆరోపిస్తున్నాడు.