Spread the love

రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి – కానీ రాజకీయం ఫుల్ !

ప్రవీణ్ పగడాల అనే హైదరాబాద్ కు చెందిన పాస్టర్ బుల్లెట్ పై రాజమండ్రికి వచ్చారు. ఓ బ్యాక్ బైక్ కు కుట్టుకుని డ్రైవింగ్ ప్యాషన్ తో ఆయన స్నేహితుడిని కలుస్తానని బయలుదేరారు. రాజమండ్రిలో ఓ చోట రోడ్డు ప్రమాదానికి గరయ్యారు. అది అర్థరాత్రి జరగడంతో ఎవరూ కనిపెట్టలేపోయారు. ఉదయం అక్కడ ప్రమాదం జరిగిందని తెలిసి ఆస్పత్రి తరలించారు. అప్పటికి చనిపోయారు. చనిపోయింది ఎవరా అని వివరాలు పోలీసులు తెలుసుకున్నారు. ఆ వ్యక్తి పేరు ప్రవీణ్ పగడాల… సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన పాస్టర్ అని తేలింది.

ప్రవీణ్ పగడాల తన పని తాను చేసుకుపోయే పాస్టర్. ఆయన ప్రసంగీకుడు. ఎప్పుడూ రాజకీయ వివాదాల్లోకి కానీ.. చర్చిల వివాదాల్లోకి కానీ రాలేదు. ఎప్పుడూ ఆయన పేరు వివాదాస్పదం కాలేదు. కానీ ఆయన రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఏదో కుట్ర ఉందని అందరూ తెరపైకి వచ్చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలు. హర్షకుమార్ దగ్గర నుంచి కేఏ పాల్ వరకూ అందరూ ఇది హత్యేనని పోలీసులు చెప్పాలని పట్టుబడుతున్నారు. ఎవరో చంపేశారని అంటున్నారు. కానీ ఆయనతో ఎవరితో

ప్రవీణ్ పగడాల వచ్చే దారులతో పాటు రాజమండ్రిలో ఆయన ప్రయాణించిన అన్ని మార్గాల్లోనూ సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషించారు. ఎక్కడా అనుమానాస్పద పరిస్థితులు కనిపించలేదు. అసలు ప్రవీణ్ పగడాల రాజమండ్రికి వస్తారన్న సమాచారం కూడా ఎవరికీ తెలిసే అవకాశం లేదు. దురదృష్టవశాత్తూ ఆయన రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఈ రాజకీయ నేతలకు ఆయన ప్రమాదంతో రాజకీయం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. కుల, మతాల పట్ల ద్వేషం పెంచి చలి కాచుకునేందుకు రెడీగా ఉండే ఈ నేతల హడావుడి కారణంగా పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేయిస్తున్నారు. అయినా రోడ్డు ప్రమాదం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి కానీ.. హత్య అని కాదని అంటున్నారు.

కానీ కేఏ పాల్ లాంటి వాళ్లు అసలు సంబంధం లేకపోయినా పవన్ కల్యాణ్ రెచ్చగొట్టడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.