Spread the love

మాజీ మంత్రి కేటీఆర్ పై రెండు కేసులు నమోదు

కలం నిఘా: న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:మార్చి 26
మాజీమంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,కేటీఆర్‌ పై రెండు కేసులు నమోద య్యాయి,నల్గొండ జిల్లాలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రజిత ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీసులు ఆయనపై నకిరేకల్ పీఎస్‌ లో రెండు కేసులు నమోదు చేశారు..

నల్గొండ జిల్లా నకిరేకల్‌ పట్టణంలో పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌,మాస్ కాపింగ్ వ్యవహారంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రజితకు సంబంధం ఉందంటూ సోష ల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేటీఆర్‌ పై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చౌగోని రజిత కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్‌తో పాటు సోషల్‌ మీడియా ఇంచార్జి మన్నె క్రిశాంక్‌ కొణతం దిలీప్‌ కుమార్‌‌ లపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.

పేపర్ లీక్ అయిందంటూ వెబ్‌సైట్‌ లో వచ్చిన వార్తను వాస్తవాలు తెలుసుకోకుం డా కేటీఆర్‌ సోషల్ మీడి యా ట్విట్టర్ లో షేర్‌ చేశారని ఆ ఫిర్యాదులో తెలిపారు.

అయితే, పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు ఒక మైనర్‌ బాలికతో పాటు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.