
సింగ్ నగర్ మక్కా మసీద్ నందు ముస్లిం మైనారిటీల పవిత్ర రంజాన్ మాసంలో మసీదు పెద్దలు నాగూర్ గారి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది
ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మైనారిటీల పక్షపాతి అయిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ
ఈ రంజాన్ పర్వదినాలలో పవిత్రమైనటువంటి ఒకరోజున మైనారిటీ సోదరి సోదరీమణుల కు అందరికీ ఇఫ్తార్ విందు ఇస్తూ ఆ అల్లాహ్ అందరికీ మంచి చేయాలని ప్రార్థిస్తూనట్లు చెప్పారు. నాకు మద్దతును ఇచ్చి ఎన్డీఏ కూటమికి సెంట్రల్ నియోజకవర్గంలో మెజారిటీలో ప్రధాన భూమిక వహించిన మైనార్టీలకు అన్ని రంగాలలో వారిని ముందుకు తీసుకొని పోతూ ప్రభుత్వ పరంగా రావలసినటువంటి సంక్షేమ పథకాలు, ఆర్థికంగా నిలబడేందుకు వారి జీవితాల అభివృద్ధికి పూర్తిగా బాధ్యత తీసుకుంటామని తెలిపారు.
గతంలో 2014 – 2019 మధ్యలో పవిత్ర రంజాన్ మాసంలో మైనార్టీ సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది అన్నారు.
గడచిన వైసిపి హయంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం అటకెక్కిందన్నారు. మైనారిటీలను వైసిపి ప్రభుత్వం చిన్న చూపు చూసిందని, టిడిపి ప్రభుత్వం ఇచ్చిన రంజాన్ తోఫాను దూరం చేసింది అన్నారు. మరలా రాష్ట్రంలో టిడిపి ఓటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముస్లిం మైనార్టీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మైనారిటీల పక్షపాతిగా టిడిపి కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసేలా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. పైపులరోడ్ ఖబ్రస్తాన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యడం తోపాటు ఇప్పటికే పాయకాపురం లోని ఖబ్రస్తాన్ మరమత్తులకొసం 19.87లక్షలరూపాయాలు టెండర్లు పిలవడం జరిగింది చెప్పారు. అలాగే ఇమామ్ మౌజాన్ లకు గౌరవ వేతనం 15000 రూ, మరియు ఉర్దూ అకాడమీ లలో టీచర్ల భర్తీ మరియు అనేక మంది మైనారిటీలకు BC E కింద లోన్లు పెట్టుకునే వెసులుబాటు కల్పించి ఘనత టిడిపి ప్రభుత్వనిదే అని కితాబునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాన్ వలి, బాషా, బేరింగ్ బాషా, రహీమ్ తదితరుల పాల్గోన్నారు
