
మహబూబాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ప్రశంసలు.
ఫ్లాస్కులను పంపిణీ చేసిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్, ఐపీఎస్ ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ఫ్లాస్కులను పంపిణీ చేసి, వారి అంకితభావాన్ని ప్రశంసించారు.ప్రత్యేకముగా శాలువాతో సన్మానించారు.
అండర్ బ్రిడ్జి మూసివేయబడిన సమయంలో రైల్వే గేట్ సమీపంలో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలందించిన పోలీసు సిబ్బంది అద్భుతమైన విధి నిర్వహణను ప్రదర్శించారు. వారి సేవలను గుర్తించి, ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్ వారికి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కష్టపడి పనిచేస్తూ ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో సేవలందిస్తున్నారు. వారి సేవలు అభినందనీయమైనవి” ఈ ఎండాకాలం లో సూర్యుడి తాపాన్ని ఎదురుకుంటూ విధులు నిర్వహించడం చాలా కష్టం అని అన్నారు. నీరు ఎక్కువగా తాగుతూ వీలైనంత వరకు నీడలో ఉంటూ సందర్బనికి తగ్గట్టు విధులు నిర్వహించాలని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ తిరుపతి రావు, ఎస్.బి సీఐ చంద్రమౌళి,టౌన్ సీఐ దేవేందర్, ఆర్.ఐలు అనిల్, నాగేశ్వర్రావు, పాల్గొన్నారు.
