Spread the love

తాగునీటి సరఫరా, చెరువులు..లిఫ్ట్ ల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించను : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • లింగంగుంట్ల తాగునీటి చెరువును, కుప్పగంజివాగు లిఫ్ట్ ను పరిశీలించిన ప్రత్తిపాటి.
  • తూబాడులో సీసీరోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనుల పరిశీలన

నియోజకవర్గంలోని తాగునీటి చెరువుల నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, చెరువుల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేసి, గట్లపై మంచి మొక్కలు పెంచాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలోని మంచినీటిచెరువును, కుప్పగంజి వాగుపై ఉన్న ఎత్తిపోతలపథకాన్ని (లిఫ్ట్) మాజీమంత్రి గ్రామస్తులతో కలిసి పరిశీలించారు.

3 గ్రామాలకు తాగునీరు అందించే చెరువును జాగ్రత్తగా నిర్వహించండి. చెరువులోని పూడిక తొలగించి చుట్టూ మొక్కలు పెంచండి.

చెరువులోని పూడికను వేసవిలోనే తొలగించాలని, ఎలాంటి నాచు, తూటికాడసహా, ఇతర వ్యర్థాలు లేకుండా చూడాలని, చెరువు గట్టుపై మంచి మొక్కలు పెంచాలని పుల్లారావు ఆర్.డబ్ల్యూఎస్ మరియు పంచాయతీ అధికారుల్ని ఆదేశించారు. గ్రామస్తులు కూడా చెరువును రక్షణలో ప్రభుత్వ సిబ్బందికి సహకరించాలన్నారు. చెరువుకు నీటి సరఫరాకోసం కుప్పగంజి వాగుపై రూ.25లక్షలతో ఇటీవలే మరమ్మతులు చేసిన లిఫ్ట్ ను పరిశీలించిన మాజీమంత్రి, అధికారులకు పలుసూచనలు చేశారు. లిఫ్ట్ ను జాగ్రత్తగా వినియోగించాలని, పైపులైన్ల నుంచి నీరు వృథా అవ్వకుండా చూడాలని, లీకేజ్ లను తక్షణమే సరిచేయాలని చెప్పారు. ఇటీవలే లిఫ్ట్ కు మరమ్మతుల చేసినందున మోటార్లను జాగ్రత్తగా వినియోగించాలని చెప్పారు. లిఫ్ట్ పాడైతే తాగునీటికి ఇబ్బంది అవుతుందని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా పనిచేయాలన్నారు. వేసవిలో ఒక్కరోజు నీటిసరపరా నిలిచిపోయినా అనేక సమస్యలు తలెత్తుతాయనే విషయాన్ని అధికారయంత్రాంగం విస్మరించకూడదన్నారు. లిఫ్ట్ ద్వారా లింగంగుంట్ల,కావూరు, పురుషోత్తమపట్నం గ్రామాలకు తాగునీరు, 2586 ఎకరాలకు సాగునీరు అందుతుందనే నిజాన్ని గుర్తించి పనిచేయాలని మాజీమంత్రి సూచించారు. సొంతనిధులతో లిఫ్ట్ మరమ్మతు పనులు చేయించిన నీటిసంఘం అధ్యక్షులు భైరా సంజీవరావును ఆయనకు సహకరించిన లింగంగుంట్ల గ్రామ టీడీపీ నాయకులు తూబాటి కిశోర్, పెడవలి చంద్రశేఖర్, గ్రామ రైతుల్ని ప్రత్తిపాటి పేరుపేరునా అభినందించారు. సమస్యను గుర్తించి లిఫ్ట్ ను పునరుద్ధరణలో గ్రామస్తులంతా ఒకే మాటపై ఉండి పనిచేయడం నిజంగా మెచ్చుకోవాల్సిన అంశమన్నారు.

సీసీ రోడ్, డ్రైనేజ్ పనుల నాణ్యతలో తేడాలొస్తే అధికారులే బాధ్యులవుతారు..

నాదెండ్ల మండలంలోని తూబాడు గ్రామంలో రూ.21లక్షలతో వేస్తున్న సిమెంట్ రోడ్, నిర్మాణంలో ఉన్న డ్రైనేజ్ లను పరిశీలించిన మాజీమంత్రి, నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా రోడ్డు వేయాలని కాంట్రాక్టర్ కు, అధికారులకు సూచించారు. మెటీరియల్ లో తేడా రాకూడదని, రోడ్డు, డ్రైనేజ్ లు పూర్తయ్యాక నాణ్యతపై గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు వచ్చినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పుల్లారావు అధికారుల్ని హెచ్చరించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల విడుదలలో కూటమిప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు రావని, చేసే పనుల్లో లోపాలు లేకుండా చూడాల్సింది కాంట్రాక్టర్లు, అధికారులేనని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు నెల్లూరి సాదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, తుబాటి కిషోర్, అధికారులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.