
మండలంలో రైతు సేవా కేంద్రంలో కందులు కొనుగోలు
పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని రైతు సేవా కేంద్రాలలో కందుల కొనుగోలును ప్రారంభిస్తున్నట్టుగా ఎడ్లపాడు మండల వ్యవసాయ అధికారి సి.హెచ్ . సరిత తెలిపారు .దీనిలో భాగంగా వారు మాట్లాడుతూ ఏపీ మార్క్ ఫెడ్ వారు మండలంలోని రైతు సేవా కేంద్రాలలో కందులు మరియు శనగల కొనుగోలు ప్రారంభించి ఉన్నారని, మండలంలో కంది మరియు శనగ సాగు చేస్తున్న రైతులు అందరూ విరిగా తాము సాగు చేసిన పంటకు ప్రభుత్వం వారు క్విoటాకు కందికి -7550 /- మరియు శనగ కు 5650/- రూపాయలుగా నిర్ణయించారు అని, నిర్ణయించిన మద్దతు ధర కన్నా తక్కువ ఉన్న ఎడల వారు సమీపంలోని రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న యెడల మార్క్ ఫెడ్ వారి ద్వారా కొనుగోలు చేస్తారని తెలియజేశారు. కావున రైతులందరూ కంది మరియు శనగ పంటలను మద్దతు ధరకు అమ్ముకోవాల్సిందిగా కోరారు.
