
జోన్ల వారీగా వీధి విక్రయదారులు వ్యాపారాలు చేసుకోవాలి.
కమిషనర్ ఎన్.మౌర్య
నగరంలో వీధి విక్రయదారులు కొరకు కేటాయించిన జొన్లలో వ్యాపారాలు చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఎన్.మౌర్య అధ్యక్షతన వీధి విక్రయదారుల టౌన్ వెండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో వెండింగ్ జోన్స్ – గ్రీన్ జోన్స్, అంబర్ జోన్స్, రెడ్ జోన్స్ గా విభజించామని, కమిటీ మెంబర్స్ సమక్షంలో టౌన్ మ్యాప్ తయారు చేయడం జరిగిందని అన్నారు. దీని ప్రకారమే గ్రీన్ జోన్స్ ఉన్న దగ్గర ఎల్లవేళల వ్యాపారాలు నిర్వహించవచ్చని, అంబర్ జోన్స్ (రిస్ట్రిక్టెడ్ జోన్స్) నందు ఉదయం 6.00 నుండి 8.00 వరకు సాయంత్రం 6.00 నుండి 10.00 గంటల వరకు వ్యాపారం చేసుకోవచ్చని, రెడ్ జోన్స్ లో పూర్తిగా వ్యాపారo చేయకూడదని అన్నారు.
వీధి వ్యాపారులు జోన్స్ విధానంలో వ్యాపారాలు చేయుటకు సమ్మతిస్తూ, తమకు ఫుడ్ స్ట్రీట్ ని ఏర్పాటు చేయవలసినదిగా కమిషనర్ ను కోరారు. 15 రోజుల తరువాత వీధి విక్రయ దారులకు రి-సర్వే నిర్వహించి అర్హులైన వీధి విక్రయ దారులకు జోన్స్ అలాట్ చేసి వారికి గుర్తింపు కార్డులను మరియు వెండింగ్ సర్టిఫికేట్లను మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో వీధి విక్రయదారులు పాల్గొని నగరానికి ప్రథమ స్థానం వచ్చేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, డీసీపీ మహా పాత్ర, స్టాండింగ్ కమిటీ మెంబర్ దినకర్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ట్రాఫిక్ డిఎస్పీ రామకృష్ణ, ఏసిపి బాలాజీ, మెప్మా సి.ఎం.ఎం.లు కృష్ణవేణి, సోమ కుమార్, గాయత్రి, వీధి విక్రయదారులు పాల్గొన్నారు.
