
క్వారీల్లో అక్రమంగా డంప్ చేస్తున్న నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించండి.
సిపిఐ కుతుబుల్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ డిమాండ్.
గాజులరామారం లోని సర్వేనెంబర్ 305,307లలో ఉన్న క్వారీలను కబ్జాదారులు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అంటే భయం లేకుండా రాత్రి కాకుండా పగలు కూడా టిప్పర్లను పెట్టి చదును చేస్తున్నారని, వారిని వెంటనే పట్టుకొని శిక్షించాలని సిపిఐ నాయకత్వం నేడు మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ మల్లికార్జున రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
నెల క్రితం రెవెన్యూ అధికారులు, హైడ్రాధికారులు అక్రమంగా డంపు చేస్తున్న టిప్పర్లను పట్టుకొని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో అప్పగించి సీజ్ చేసినప్పటికీ భూకబ్జాదారులు ఎటువంటి భయం లేకుండా నెల తిరగకముందే మళ్లీ రాత్రి కాకుండా, పట్టపగలు రెవెన్యూ కార్యాలయం ఎదురుగ నుంచి టిప్పర్లలో పెద్దపెద్ద బండరాలను తీసుకువచ్చి క్వారీలను పూడుస్తున్నారని, ఆ టిప్పర్లకు బండరాళ్లు పడిపోకుండా ఎటువంటి రక్షణ లేదని ఒకవేళ అనుకోకుండా ఆ బండరాళ్లు కింద పడితే మరణించే పరిస్థితి కూడా ఉన్నదని, అలాంటి వారిపై రెవెన్యూ అధికారులు చుట్టపు చూపుగా చిన్న చిన్న సెక్షన్లు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని వెంటనే వారి పైన కఠినమైన శిక్షలు వెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిన్న టిప్పర్లు వాటి వీడియోలను మరియు టిప్పర్ నెంబర్లను కూడా వినతిపత్రంతో జతపరచడం జరిగింది. రానున్న రోజుల్లో హైడ్రా ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేస్తామని సిపిఐ నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి సదానంద్, సిపిఐ నాయకులు రవి, సామెల్, ప్రభాకర్, జంబు, కార్తీక్ పాల్గొన్నారు.
