TEJA NEWS

ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలను భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
పశ్చిమ నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ మధు మస్తాన్, జనసేన 47వ డివిజన్ అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మ దిన వేడుకల్లో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఎస్ కృష్ణ ప్రసాద్, ఎల్ శ్యాం ప్రసాద్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి రామ్ చరణ్ కి విషెస్ తెలిపారు.
రామ్ చరణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
కార్యక్రమంలో చిరంజీవి యువత నాగరాజు, నాని, రవికుమార్, బావిశెట్టి శ్రీను, గడ్డిపాటి కిరణ్, మంతాపురం రాజేష్, రాజా నాయుడు, జిల్లెల అనిల్, ఎర్రబెల్లి కనకారావు, మదన్, సప్పా శ్రీనివాస్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.