TEJA NEWS

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన…

  • జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ..

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విజయలక్ష్మి 15,000/-, శేఖర్ 19500/- నందిని 12,000/- నాగేష్ బాబు 60000/- అనిత 21000/- మొత్తం 1,27,500/- రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ చేతులమీదుగా అందజేశారు.. అనంతరం సరితమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పేద నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు సీఎం రిలీఫ్ ఫండ్, రైతు భరోసా, రైతు బీమా పథకాలతో బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందన్నారు…

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,పులిపాటి వెంకటేష్,టిఎన్ఆర్ జగదీష్, పటేల్ శ్రీనివాసులు,పెదొడ్డి రామకృష్ణ, దడవాయి నర్సింహులు, పాల్వాయి అయ్యప్ప, జమ్మిచేడు రాము,ఎల్కూర్ నర్సింహులు, గుర్రంగడ్డ కుర్మన్న,ఈశ్వర్,డి.ఆర్.ముని,రవి తదితరులు ఉన్నారు…