TEJA NEWS

ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ ను కలిసిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

డోర్నకల్- మిర్యాలగూడ,గద్వాల అలైన్మెంట్ పై చర్చ

ఖమ్మం: పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ను శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా..డోర్నకల్ మిర్యాలగూడ, డోర్నకల్ గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ గురించి చర్చించారు. ఖమ్మం ఎంపీ .. వివరించిన తీరును బట్టి.. రైల్వే బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సూచించిన అంశాలను కచ్చితంగా పరిశీలనలో ఉంచుకుంటామని ఈ సందర్భంగా అభయమిచ్చారు.