
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు.. పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు
శేరిలింగంపల్లి లోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ అథారిటీ అఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్” పోటీల కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ , తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ ఛైర్మెన్ శివసేన రెడ్డి , ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ నిఖత్ జరీన్ , మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ , ఎంబీసీ ఛైర్మెన్ జెరిపేటి జైపాల్ , మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ కొరకు ప్రత్యేక శ్రద్ధతో తగిన సౌకర్యాలను సమకూర్చి క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా సంతోషదాయకం అని అన్నారు. క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీడలలో ప్రతిభాపాటవాలను ప్రదర్శించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని, క్రీడాకారులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హార్దిక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, నేషనల్ కరాటే అసోసియేషన్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.
