TEJA NEWS

శబరిమలలో రద్దీ కొనసాగుతోంది.

24 గంటల్లో లక్ష మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు.

రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు భక్తులకు పలు కీలక సూచనలు చేసింది.

శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

అయ్యప్పను సంక్రాంతి పండగకు ముందే దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

జ్యోతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని భావించి చాలా మంది ఇప్పటికే శబరిమల చేరుకుని ఇరుముడులు సమర్పించుకుంటున్నారు.

ప్రస్తుతం శబమరిమలలో అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

24 గంటల్లో లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు. సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం ఉండటంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయ్యే అవకాశముంది.

దర్శనం కోసం వర్చువల్‌ క్యూ బుకింగ్‌ కూడా ప్రారంభమైంది.


TEJA NEWS