
యువతకు దొడ్డి కొమరయ్య ఆదర్శం కావాలి
పోరాటయోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య
పాలమూరు ఎమ్మెల్సీ ఎన్. నవీన్ కుమార్ రెడ్డి
కడ్తాలలో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి కొమరయ్య చిత్రపటానికి నివాళులు
నివాళులర్పించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జైపాల్ యాదవ్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని పాలమూరు ఎమ్మెల్సీ ఎన్. నవీన్ కుమార్ రెడ్డి కీర్తించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండల కేంద్రంలో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితరులతో కలిసి దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దొరలు, భూస్వాములు రైతులపై చేస్తున్న దౌర్జన్యానికి ఎదురునిలిచి, భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన మహనీయుడు అని కొనియాడారు. కొమురయ్య జయంతిని గత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. నేటి యువత కొమురయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అన్యాయంపై పోరాడాలని పిలుపునిచ్చారు. దొడ్డి కొమురయ్య తెలంగాణలో దొరలు, భూస్వాముల దౌర్జన్యానికి ఎదురునిలిచి ప్రాణాలను ఆర్పించారన్నారు. తెలంగాణ సమాజంలో అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం మహనీయుల స్ఫూర్తితోనే వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉప్పల వెంకటేష్ మాజీ జెడ్పిటిసిలు ఎంపీపీలు తదితరులు నివాళులు అర్పించారు..
