
సమస్యలు వెలికితీస్తూనే బాధితులకు అండగా నిలవడం అభినందనీయం
ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట సేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకం
ఉగాది సేవా పురస్కారం అందుకున్న చిలకలూరిపేటకు అభినందనలు
కాపు సంఘం ఆధ్వర్యంలో సభ్యులకు సత్కారం
చిలకలూరిపేట: ప్రజల సమస్యలను వెలికితీస్తూనే, అభాగ్యులను ఆదరించటం, వారికి చేయూతనందించటం అభినందనీయమని కాపు సంఘం నాయకులు అంకిరెడ్డి రమేష్ అన్నారు. ఉగాది సందర్భంగా ఇటీవల ఏపీడబ్ల్యూజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట చేసిన సేవలకు జిల్లా కలెక్టర్ పి అనిల్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ,నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా సేవ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా బుధవారం సంఘ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజే యు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, అడపా అశోక్ కుమార్, క్లబ్ కార్యదర్శి షేక్ దరియా వలి లను ఘనంగా సన్మానించారు. క్షేత్రస్థాయిలో పర్యటించే జర్నలిస్టులకు ప్రజా సమస్యలపై అవగాహన ఉంటుందని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారిధి లా పనిచేస్తూనే, మరోవైపు జర్నలిస్టులే సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వటం శుభపరిణామం అని కొనియాడారు. నాటి కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలకు సేవలు అందిస్తూ విజయవాడ వరద బాధితులకు మేమున్నామని ఆపన్న హస్తం అందించిన జర్నలిస్టు మిత్రుల సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. యువ జర్నలిస్టులు సేవా దృక్పథం కలిగి ఉండి స్ఫూర్తిదాయకంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరి కూటి నాగేశ్వరరావు, సురం రవి. బైరా సతీష్, రాష్ట్ర బీసీ సంఘం నేత మాదాసు పృథ్వి సాయి, చక్రి, తేజ, షేక్ అబ్దుల్ ఖాదర్, బాలాజీ సింగ్, ఎన్ , శ్రీకాంత్ షేక్ సాథిక్. కే, సాంబశివరావు, అంకిరెడ్డి మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
