
వనపర్తి :
వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామంలోని శివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు
ఈ సందర్భంగా ఆయన శివుడికి ప్రత్యేక పూజలు చేశారు
నూతనంగా ఏర్పాటు చేసిన ధ్యస్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించిన ఎమ్మెల్యే ప్రత్యేక హారతులు ఇచ్చి పూజలు చేశారు
అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సత్య శీలా రెడ్డి, జయపాల్ రెడ్డి, వెల్టూరు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, కొంకి వెంకటేష్, సురేష్ గౌడ్, రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
