
ప్రజల ఆరోగ్యరక్షణకు కాటూరి వైద్యకళాశాల చేస్తున్న కృషి వెలకట్టలేనిది : మాజీమంత్రి ప్రత్తిపాటి
- అనారోగ్య సమస్యలతో దూరప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడకుండా, ఇళ్లవద్దకు వచ్చే కాటూరి వైద్యకళాశాల సిబ్బంది సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : ప్రత్తిపాటి
ప్రజల ఆరోగ్యరక్షణ కోసం కాటూరి వైద్య కళాశాల పనిచేస్తోందని, వైద్యసిబ్బంది నేరుగా మొబైల్ ల్యాబ్ ద్వారా తమ ఇళ్లవద్దకు వచ్చి అందిస్తున్న వైద్యసేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. చిలకలూరిపేట మండలం గోపాలవారిపాలెం గ్రామంలో కాటూరి వైద్య కళాశాలవారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి సహాయసహాకారంతో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపుని మాజీమంత్రి ప్రత్తిపాటి శుక్రవారం ప్రారంభించారు. తమ అనారోగ్య సమస్యలకోసం, ఎక్కడికో వెళ్లి ఇబ్బందులు పడే అవసరం లేకుండా, గ్రామాల్లో ఇళ్లవద్దనే లభించే వైద్యసేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. గోపాలవారిపాలెం గ్రామస్తుల కోరినంతనే కాటూరి వైద్య కళాశాల వారితో మాట్లాడి గ్రామంలోనే వైద్యశిబిరం ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. కాటూరి వైద్య కళాశాల వారు ఏర్పాటుచేసిన మొబైల్ ల్యాబ్
