TEJA NEWS

ఎస్.ఎల్.కె టాలెంట్ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

సూర్యపేట జిల్లా : సూర్యాపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో ఎస్ ఎల్ కే టాలెంట్ స్కూల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లగిశెట్టి త్యాగరాజు, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి, వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సహించాలని, విద్యార్థి దశ నుండి స్వీయ క్రమశిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన 19వ వార్డు మాజీ కౌన్సిలర్ సుంకరి అరుణ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం, అలవర్చుకొని మంచి నడవడితో మెలగాలని బావి భారత పౌరులుగా ఎదగాలని కోరారు.ఈ వేడుకలలో చిన్నారుల వేషాధారణ నృత్యాలు ప్రత్యేకంగా అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ కే ఎల్ కే కాలేజీ చైర్మన్ అంగిరేకుల నాగార్జున, ఎస్ ఎల్ కే చైర్మన్ సుంకరి నగేష్, ప్రత్యేక అతిథులుగా మాజీ వార్డు కౌన్సిలర్ సుంకరి రమేష్ అరుణ, న్యూ సిటీ సెంట్రల్ స్కూల్ కరెస్పాండెంట్ ఆర్. శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.