TEJA NEWS

వక్ఫ్ స్థలాలను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు కట్టబెట్టే కుట్ర….

ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలి…

వక్ఫ్ బచావో కల్వకుర్తి నియోజకవర్గ సభ్యులు…

ఆర్డీఓకు వినతిపత్రం అందజేత…

నాగర్ కర్నూలు జిల్లా

పేద ముస్లీంలకు దక్కాల్సిన వక్ఫ్ బోర్డు ఆస్తులను పెట్టుబడిదారుల కట్టబడేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తెరపైకి తీసుకువచ్చి పార్లమెంట్ లో ఆమోదింపజేసిందని వెంటనే వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని వక్ఫ్ బచావో కల్వకుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్స్ సయ్యద్ మసూద్,షేక్ ఏజాస్,జహీర్,అబ్దుల్ ఖాదర్, మోక్తదర్,లు పేర్కొన్నారు.

ప్రార్థనల అనంతరం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కల్వకుర్తి పట్టణంలోని జామా మసీదు నుండి వక్ఫ్ బచావో కల్వకుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో ముస్లీం మత గురువులు,యువకులు మహబూబ్ నగర్ చౌరస్తా వరకు పెద్దఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ముస్లీం యువకులు రోడ్డుపై బైఠాయించి పార్లమెంట్ లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్,ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని కోరుతూ వక్ఫ్ బచావో కల్వకుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్లు పట్టణంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనునాయక్ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం వల్ల మత స్వేచ్ఛ సమానత్వానికి హామీ ఇచ్చే రాజ్యాంగంలోని 14,25, 26 ఆర్టికల్స్ ఉల్లంఘనతో పాటు మతపరమైన స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడం ముస్లీంల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.వక్ఫ్ బిల్లు చట్టరూపం దాల్చినట్లయితే మసీదులు, ఈద్గాలు,దర్గాలు,అషూర్ ఖానాలు,స్మశాన వాటికలు వంటి మతపరపైన ప్రదేశాలతో సహా వక్ఫ్ ఆస్తులకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు.కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుల అధికారాన్ని నిర్వీర్యం చేయడంతో వక్ఫ్ ఆస్తులను కబ్జాదారులకు రెగ్యులర్ చేసుకోవడానికి మార్గం సుగమం చేస్తుందని మండిపడ్డారు.వక్ఫ్ బిల్లును ప్రస్తుత ప్రతిపక్ష ఇండియా కూటమినేతలు,ముస్లీం పర్సనల్ లా బోర్డుతో పాటు దేశంలోని వివిధ ముస్లీం సంఘాలు,ప్రజా మేధావి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. పార్లమెంట్ లో ఆమోద ముద్రపడ్డ వక్ఫ్ బిల్లును కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో మత గురువులు వకీల్ మౌలానా, ఓవైజ్ మౌలానా,అమీర్ మౌలానా,లతో పాటు వక్ఫ్ బచావో కల్వకుర్తి కమిటీ సభ్యులు పప్పు,మక్బూల్, విక్కీ,హజి,ఖాదర్,సోఫీ, సలాం,సోహెల్,ఆరీఫ్,అఖిల్,ఖదీర్,షారూక్ ఖాన్, అబుబాకర్,తదితరులు పాల్గొన్నారు.