TEJA NEWS

రాజీవ్ యువ వికాసానికి 9 లక్షల అప్లికేషన్లు..!!

20 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారుల అంచనా
ఆఫ్ లైన్లో సైతం తీసుకుంటున్న ఆఫీసర్లు
హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు అనూహ్య స్పందన వస్తోంది.
వాస్తవానికి ఈనెల 4తో గడువు ముగియగా ఈనెల 14 వరకు అప్లై చేసుకునేందుకు గడువు పొడిగించారు.

ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలకు కలిపి మొత్తం 9 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈనెల 14 వరకు మొత్తం 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకానికి అప్లై చేసేందుకు మీ సేవ కేంద్రాలు, ఇంటర్ నెట్ సెంటర్లకు లబ్ధిదారులు పోటెత్తుతున్నారు.

కొత్త క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ కోసం భారీగా అప్లై చేస్తుకుంటున్నారు. క్యాస్ట్, ఇన్ కమ్ కు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, 2016 తరువాత తీసుకున్న వాటిని అంగీకరిస్తున్నామని అధికారులు ప్రకటించారు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే సరిపోతుందని, ఇన్ కం అవసరం లేదని స్పష్టం చేశారు.

ఇక ఈ స్కీమ్ గురించి సమాచారం, అర్హత, ఇతర సమగ్ర వివరాల కోసం మండల, మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ అప్లికేషన్లను మే 31 వరకు మండల, జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేసి లబ్ధిదారులను మండల కేంద్రాల్లో ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపనున్నారు. జిల్లా కలెక్టర్లు ఆమోదించిన తరువాత జూన్ 2న ప్రభుత్వం రుణాలు మంజూరు చేయనుంది.

బ్యాంక్ లెటర్ తప్పనిసరి

యువ వికాసం పథకం కోసం అప్లై చేసుకుంటున్న లబ్ధిదారులు అప్లికేషన్ లో తమకు ఉన్న బ్యాంక్ అకౌంట్ ఖాతా నంబర్, బ్రాంచ్ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ స్కీమ్ కు బ్యాంకు అధికారులు కన్సెంట్ లెటర్ (లోన్ ఇచ్చేందుకు ఏ అభ్యంతరం లేదంటూఐ ఇచ్చే ఎన్వోసీ లాంటిది ) ఇస్తేనే అర్హులుగా పరిగణిస్తారు.