
సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే జారె
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం. నాచారం గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారబోయిన హరిబాబు, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రయివేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొంది (స్టంట్స్) ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించి,ప్రస్తుత ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. పలు జాగ్రత్తలు తెలిపి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే గ్రామంలో అనారోగ్యంతో మరణించిన భూషణం పార్థివ దేహాన్ని సందర్శించి పూలువేసి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీకటి శ్రీనివాసరావు, ఎర్రగొర్ల రాధాకృష్ణ, గూడపాటి వెంకట్రావు, మాజీ సర్పంచ్ వేపకుంట్ల వెంకమ్మ రాజులపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
