TEJA NEWS

గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి ప్రజలను హింసిస్తున్న బిజెపి.
సిపిఐ, ఎన్ ఎఫ్ ఐ డబ్లు నాయకులు.
కేంద్ర ప్రభుత్వం నిన్న గ్యాస్ సిలిండర్ ధర పైన 50 రూపాయలు అలాగే పెట్రోల్ డీజిల్ పైన రెండు రూపాయల ట్యాక్స్ ను పెంచడానికి నిరసిస్తూ నేడు సిపిఐ మరియు మహిళా సమైక్య ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట అవుట్ పోస్ట్ వద్ద గ్యాస్ సిలిండర్తో నిరసన నిర్వహించి నరేంద్ర మోడీ ఫోటోను దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ వ్యాప్తంగా చమరు ధరలు, గ్యాస్ ధరలు తగ్గుతుంటే ఇక్కడి బిజెపి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పైన పెట్రోల్ డీజిల్ పైన ధరలు ఎందుకు పెంచాల్సి వస్తుందో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో బ్యారేల్ ధర 120 రూపాయలు ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ కి 65 ఉండేదని నేడు అదే చమరు బ్యారెల్ ధర 60 రూపాయలు ఉంటే పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు పైబడి ఉన్నాయని, నరేంద్ర మోడీ ధరలు తగ్గిస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచి మాట తప్పి ధరలను పెంచుకుంటూ పోతున్నాడని బిజెపి ప్రభుత్వం అంటేనే సామాన్య ప్రజల పైన ధరలు పెంచి వారిని తిండికి, విద్యకు దూరం చేసి ఉత్తర భారత దేశ వ్యాపారస్తులకు లక్షల కోట్లు కట్టబెట్టే పార్టీ బిజెపి అని, ఈ సమస్యలను ప్రజలు చర్చించకుండా చేయడానికి దేవుడి పేరుతో,మతం పేరు తో రాజకీయం చేస్తూ అసలైన సమస్య నుండి దారి మళ్ళిస్తుంటారని కావున ప్రజలు బిజెపి హాయంలో ఉన్న ధరలను, కమ్యూనిస్టులు మద్దతుగా ఉన్న యూపీఏ ప్రభుత్వంలో ఉన్న ధరలను బేరిజు వేసుకొని ఎవరు ప్రజల కోసం పని చేస్తారో ఆలోచించాలని కోరారు.

నిత్యవసర ధరలు పెరగడం వల్ల ఈ దేశంలో 80 శాతం ఉన్న హిందువులు కూడా ఇబ్బంది పడుతున్నారని హిందువుల పార్టీ అని చెప్పుకునే బిజెపి తన రాజకీయాల కోసమే హిందూ అనే పదాన్ని వాడుకుంటున్నది తప్పించి హిందూ ప్రజలకు మోసం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ బిజెపిని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిజెపి ధరలు తగ్గించకపోతే రానున్న కాలంలో బిజెపిని గద్దె దించే పరిస్థితి ఏర్పడుతుందని కావున వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
జాతీయ మహిళా సమైక్య (ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ) జిల్లా అధ్యక్షురాలు హైమావతి మాట్లాడుతూ ఇప్పటికే ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మళ్లీ బిజెపి ప్రభుత్వం ధరలు పెంచడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా చాలా నష్టమని కావున పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళలను చైతన్యవంతం చేసి పెరిగిన ధరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు రాములు, శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, మహిళా సమైక్య నాయకురాలు జయమ్మ, ప్రమీల, కావ్య, సిపిఐ నాయకులు ఇమామ్, బాలరాజు, ప్రభాకర్, వెంకటాచారి, నరసింహ, బిక్షపతి, యువజన నాయకులు జంబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.