TEJA NEWS

యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్

హైదరాబాద్:
అభిమానుల ప్రాణాలు తీస్తున్న స్టార్లు… విచ్చల విడిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం మనుషుల ఉసురు తీసు కుంటుంది. ఈ సైతాన్‌ని అందంగా తయారు చేసి తమ అభిమాన తారలే వాళ్ల అభిమానుల ప్రాణా లపై ఉసిగొల్పుతున్నారు.

ఒక మనిషికి ముఖ్యంగా తమను అభిమానించే వాళ్ల ప్రాణాలను తీసేంత రాక్షసత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అంత రాక్షసత్వా నికి పాల్పడిన చాలా నార్మ ల్‌గా ఎందుకు నవ్వుతున్న మొహంతో కనిపిస్తున్నా రు? ఇన్ఫ్లుయెన్సర్ అంటే మరణాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమా ? నిజంగానే వాళ్లకు బెట్టింగ్ యాప్స్‌పై అవగాహనా లేకుండానే ఒప్పందాలు, ప్రమోషన్స్ చేశారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఏమో గాని…..

చనిపోయిన ప్రాణాలకు సమాధానమైతే ఇన్ఫ్ల యెన్సర్లు, మేధావులు, మానసిక వైద్య నిపుణులు ఎవ్వరు ఇవ్వలేరు. బ్యాన్ చేసినా భయపడని భూతం! తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను ప్రభుత్వాలు చాలా కాలం క్రితమే బ్యాన్ చేశాయి. తెలుగు రాష్ట్రా ల్లోని ఐపీవో అడ్రెస్సుల్లో ఈ యాప్స్ యాక్సెస్ కాలేవు. కానీ ఏపీ, తెలంగాణాలో రోజు అనేక యాప్స్ ద్వారా కొన్ని లక్షల కోట్ల బెట్టింగ్ నడుస్తుంది.

అయితే యాక్సెస్ కానివి కేవలం ప్రభుత్వ పర్మిషన్ ఉన్నా యాప్స్ మాత్రమే. వీటిలో లిమిటెడ్ గానే బెట్టింగ్ చేసే అవకాశ ముంటుంది. వీటికే ప్రముఖ క్రికెటర్లు బ్రాండ్ అంబాసి డర్లుగా కొనసాగుతున్నా రు. కానీ.. రాష్ట్రంలో నడుస్తున్నాయన్ని ఇల్లీగల్ యాప్స్ మాత్రమే. ఇవి యాప్ రూపంలో ప్లే స్టోర్‌లో కనిపించిన వెబ్ సైట్‌కి రీ డైరెక్ట్ అవుతుంటాయి.

బాధ్యత ఎవరిదో ఎవరికీ తెలుసు.. జియో మేనియా తర్వాత స్మార్ట్ ఫోన్ల వాడ కం మితి మీరిపోయింది, ప్రతి ఇంట్లో 3-5 స్మార్ట్ ఫోన్లు ఫుల్ నెట్ బ్యాలె న్స్‌తో పిల్లలకి ఇస్తున్నారు పేరెంట్స్‌దే నేరమని కొందరు విజ్ఞాన ప్రదర్శనలు చేస్తుంటారు. స్మార్ట్ ఫోన్లు, జియో మేనియా క్రియేట్ చేసింది పేరెంట్స్ కాదు వారికి మార్కెట్‌ని వ్యవస్థ పోకడలను రెస్ట్రిక్ చేసేంత కెపాసిటీ లేదు.