
పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు… ఎమ్మెల్యే డా మురళీ నాయక్
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే డా.మురళీ నాయక్ అన్నారు.
మహబూబాబాద్ నియోజకవర్గం
నేడు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదూరు మండలంలోని రాజులకొత్తపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే నష్టపోయిన పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాలవర్షంతో వరి, మామిడి తోట, మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని, తక్షణమే నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదే శించారు.
రైతులు కష్టపడి పండించిన వరి,పంటలు చేతికందే. సమయంలో ప్రకృతి వైపరీత్యంతో అపార నష్టం జరిగిందని, అన్నారు
ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
పదేళ్ళు అధికారంలో ఉన్న వారు నష్టపోయిన రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రస్తుతం తాము రైతులు నష్టపోకుండా కృషి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
