
రైల్వే కోడూరు నియోజకవర్గం:–
పార్టీలకతీతంగా పెనగలూరు మండల
అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి..!
- మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు..!
పేదవారి సొంత ఇంటి కల నిజం చేస్తాం.
అర్హులైన పేదలకు సొంత ఇళ్లు మంజూరు
అధికారులు పొసెషన్ ధ్రువీకరన పత్రాలను వెంటనే ఇవ్వాలని, ప్రజలకు ఈ విషయంలో ఇబ్బందులను కలిగించవద్దని, శాసన సభ్యులు అరవ శ్రీధర్ అధికారులను ఆదేశించారు.
పెనగలూరు మండలంలో రానున్న వేసవి నేపథ్యంలో తాగు, సాగు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. పెనగలూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ,రెవిన్యూ, ఇరిగేషన్ ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, ఫారెస్ట్, పోలీస్ తదితర శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో రైతులు, సాగు, తాగు, రైతుల సమస్యలపై, రెవిన్యూ సమస్య పై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెనగలూరు మండలం పరిధిలోని ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా MLA అరవ శ్రీధర్ మాట్లాడుతూ. . మండల పరిషత్, జడ్పీటీసీ, పంచాయతీ నిధుల ద్వారా మండలంలోని అన్ని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ముఖ్యంగా రానున్న వేసవి నేపథ్యంలో తాగునీటికి ఇబ్బందుల్లేకుండా సమగ్ర చర్యలు చేపట్టాలని , . ఆర్వో ప్లాంట్లు లేని గ్రామాల్లో వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు అందజేయాలని ఈ విషయంలో సీఎం చంద్రబాబుగారితో మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు దరఖాస్తు చేసుకున్న విధంగా ట్రాన్స్‌పార్మర్లకు కండకర్లు వైర్లు కూడా లిస్ట్‌లో ఉన్న ప్రకారం పారదర్శకంగా అందజేయాలని అధికారులకు సూచించారు. పార్టీలకు అతీతంగా పెనగలూరు మండలం అభివృద్ధికి సహకరించాలని సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులకు ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు,కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
