ప్రకాశం జిల్లా:-
తాటిపర్తి ఆత్మీయ కలయికతో కేడర్లో కనిపించిన జోష్….
ఏ ఒక్కరిని వదలను, ప్రతి వ్యక్తి నీ కలుపుకొని పోతా మనమంతా జగనన్న సైనికులం…తాటిపర్తి
సెవెన్ హిల్స్ ప్రాంగణమంతా నాయకులు, కార్యకర్తలతో జనసందోహంగా ఏర్పడిన మార్కాపురం…
ఎర్రగొండపాలెం నియోజకవర్గస్థాయి లో వైఎస్ఆర్సిపి నాయకుల ఆత్మీయ కలయిక సమావేశం మార్కాపురం పట్టణంలోని సెవెన్ హిల్స్ ఫంక్షన్ హాల్ నందు శనివారం ఎర్రగొండపాలెం సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. సెవెన్ హిల్స్ ప్రాంగణం అంతా ఎర్రగొండపాలెం లోని వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు కార్యకర్తలతో ప్రాంగణమంతా జన సందోహం ఏర్పడింది. కార్యక్రమానికి సంబంధించి తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏ ఒక్కరిని వదలను, ప్రతి వ్యక్తిని కలుపుకుంటూ ముందుకు వెళ్తానని తెలుపుతూ, మనందరం జగనన్న సైనికులం, అని అన్నారు. ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు, దోర్నాల, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు