
అత్యాధునిక సౌకర్యాలతో శ్రీ సాయిగణేష్ హాస్పిటల్ ప్రారంభం
సూర్యపేట జిల్లా : తల్లి ,పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం తమ హాస్పిటల్ నందు ప్రత్యేక శ్రద్ద వహిస్తామని శ్రీ సాయిగణేష్ హాస్పిటల్ నిర్వాహకులు రవి, రాము, సందీప్ చౌదరిలు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ నందు సాయి త్రివేణి కాలేజ్ పక్కన నూతన భవనం నందు శ్రీ సాయిగణేష్ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్ట మొదటి సారిగా సూర్యాపేట జిల్లా లోనే తల్లి, పిల్లల కొరకు ప్రత్యేక హాస్పిటల్ నెల కల్పి నట్లు తెలిపారు.తమ హాస్పిటల్ నందు వెంటిలేషన్ సౌకర్యం తో పాటు అత్యాధునిక సేవలు సాధారణ ధరకు లభిస్తాయని చెప్పారు. అప్పుడే పుట్టిన శిశువుకు సంబంధించిన అన్నిరకాల వైద్య సేవలు, స్త్రీల కు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు తమ ఆసుపత్రి నందు చికిత్స లభిస్తుందని అన్నారు. తమ హాస్పిటల్ నందు ఆదివారం నాడు న్యూరో పిజిషియన్, మంగళవారం నాడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అందుబాటులో వుంటారని చెప్పారు. తల్లి పిల్లలకు సంబంధించిన వ్యాధుల చికిత్స కోసం హైదరాబాదు, ఖమ్మం వంటి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా తమ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్నామని, సూర్యాపేట జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్ లు డాక్టర్ భరత్ కుమార్, డాక్టర్ చంద్రలోకె, డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ శ్రీలత చౌదరి , పిఆర్ వొలు విజయ్, రమేష్, వెంకటేశ్వర్లు, రంజిత్ ,యామా ప్రభాకర్, ముషం హరి తదితరులు పాల్గొన్నారు.
