TEJA NEWS

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాని తనిఖీ చేసిన డి.ఎం.హెచ్.వో

సూర్యపేట జిల్లా : సూర్యపేట కోదాడ డివిజన్ అనంతగిరి పి.హెచ్.సీ ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం తనిఖీ చేసి ల్యాబ్ నిర్వహణను డ్రగ్ స్టోర్ ను పరిశీలించారు. కాలం చెల్లిన మందులు లేకుండా ఎప్పటికప్పుడు ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి తనకి చేయాలని హెచ్చరించి, తగు సూచనలు ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్న రిపోర్ట్స్, రికార్డ్స్ ను తనిఖీ చేసి ఆన్లైన్ డేటా ఓపి, ఎన్.సి.డి నిర్వహణ గురించి అడిగి తెలుసుకుని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయవలసిందిగా సూచించారు. ప్రతి వైద్య సేవలు ఎప్పటికప్పుడు రికార్డులు నిర్వహిస్తూ ఆన్లైన్ చేస్తూ రిపోర్టు నిర్వహించాలని ఆయన అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి తో మాట్లాడుతూ రికార్డ్స్ లో ఉన్నది ఆన్లైన్లో ఉండాలని ఆన్లైన్లో ఉన్నది రిపోర్ట్స్ లో ఉండాలని సూచించారు. అనంతరం యూ.పి.హెచ్.సి కోదాడ వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహిచి సాధారణ కాన్పులు జరిగేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆస్పత్రులలో 100% ప్రసవాలు జరిగేలా చూడాలని, ఎన్ సి డి ఫాలప్ రెగ్యులర్ వివిధ ఆరోగ్య కార్యక్రమాలు సాధించవలసిన ఫలితాలు వెనుకబడి ఉన్న కార్యక్రమాలు అడిగి తెలుసుకునారు. ఆన్లైన్ డాటా పెండింగ్ లేకుండా రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు చేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఫీల్డ్ విజిట్ చేసి ఆరోగ్య కార్యక్రమాలపై మానిటరింగ్ నిర్వహించాలని హెచ్చరించారు. వారానికి ఒకసారి వైద్య సిబ్బందితో వైద్యాధికారి సమీక్ష నిర్వహించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.