
అకాల గాలి,వానలకు, రాలిపోయిన మామిడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం.
అకాల గాలి దుమారం,వర్షం, కారణంగా మామిడి, జీడి, కాకర,అరటి, పొగాకు రైతులందరికీ తీరని నష్టం వాటిల్లింది. అశ్వరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో వచ్చిన గాలి దుమారం,వర్షం వలన మామిడి కాయలు నేలరాలాయి. మామిడి చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. పసుపులేటి సుబ్బారావు కు చెందిన తోటలో సుమారు 15 టన్నుల మామిడి కాయలు నేలకు రాలాయి. మల్లాయిగూడెం లో ఉప్పల దుర్గప్రసాద్ కు చెందిన 10 ఎకరాల మామిడి తోటలో వందల సంఖ్యలో మామిడి కాయలు రాలిపోవడంతో పాటు కొమ్మలు విరిగిపడ్డాయి. తీరని నష్టం వాటిల్లిందని. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
