TEJA NEWS

భారత రాజ్యంగ నిర్మాత,బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి,నవభారత నిర్మాత,భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ , మాజీ కార్పొరేటర్లు మేకల వెంకటేష్, కాసాని సుధాకర్, గాజుల సుజాత, బొర్రా దేవి చందు ముదిరాజ్, బాలాజీ నాయక్, మాజీ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం,జ్యోతి సతీష్, దళిత సంఘాల నాయకులతో కలిసి నిజాంపేట్, రాజీవ్ గాంధీ నగర్, సాయి నగర్, లో డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ సమగ్ర సామాజిక స్వరూపాన్ని అర్థం చేసుకొని రాజ్యాంగ రచన చేసి,భావి భారత తరాలకు దిశానిర్దేశం చూపిన దార్శనికుడు భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా, భారతరత్న బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.