
అన్నమయ్య జిల్లా: పుల్లంపేటలో పోలీసుల దాస్టీకం….!!
భార్యాభర్తల మధ్య గొడవ.. 100 డయల్ కు ఫిర్యాదు చేసిన భార్య మాధురి.
భార్యా భర్తల మధ్య గొడవను సర్ది చెప్పాల్సిన పోలీసులు లాఠీ విరిగేదాకా భర్త శివప్రసాద్ ను చితకబాదిన వైనం.
అర్ధరాత్రి సమయంలో బొమ్మతొట్టి శివప్రసాద్ ను కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.
లాఠీ విరగడంతో డ్రిప్పు పైపుతో ఇష్టారాజ్యంగా దాడి చేసిన పోలీసులు.
ఒళ్లంతా కందిపోయి రక్త గాయాలతో మీడియా ముందు కన్నీటి పర్యంతమైన శివప్రసాద్.
తనకు ఆపరేషన్ జరిగిందని ముఖంలో ప్లేట్లు, కాళ్లలో రాడ్లు వేసారని కాళ్లు పట్టి బతిమిలాడుకున్నా వదలకుండా ముఖంపై బూటు కాలుతో పోలీసులు తన్నారని బాధితుడు ఆవేదన వ్యకం చేసిన శివప్రసాద్.
తనపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ శివప్రసాద్ డిమాండ్.
