
మతసామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు రాగిడి లక్ష్మారెడ్డి …
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని జీతేపీర్ దర్గా లో నిర్వహించిన ఉర్స్ ఉత్సవాలకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ , పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుకు రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చాదర్ ను సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు అని, ఇక్కడ జరిగే ఉర్స్ వేడుకల్లో కులమతాలకతీతంగా అందరూ పాల్గొంటారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎంసీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు కాసాని సుధాకర్, బాలాజీ నాయక్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు మరియు మస్జిద్ కమిటీ ప్రధాన కార్యదర్శి సలీమ్, చంద్రగిరి సతీష్, నాయకులు ప్రవీణ్ గౌడ్, సలీం ఖాన్, మస్జీద్ కమిటీ అధ్యక్షులు మీర్ ఫరూక్ అలీ, ఉపాధ్యక్షులు సయ్యద్ అక్బర్, మహమ్మద్ ఖాజా పాషా, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
