
ములకలపల్లి మండల గ్రామాల్లో ఇందిర బడిబాట కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే జారె.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ.
ఎమ్మెల్యే జారెములకలపల్లి మండల పర్యటన
AAPC నిధులతో మౌలిక వసతుల కల్పన
ములకలపల్లి మండల పర్యటనలో భాగంగా జగన్నాధపురం గ్రామపంచాయతీలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులుతో ఎంపీపీఎస్ రాజాపురం, ఎంపీపీఎస్ నరసాపురం, ఎంపీపీఎస్ జగన్నాధపురం, మరియు జగన్నాధపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలలో పూర్తికాబడ్డ మౌళిక వసతులను పరిశీలించారు. మరి కొన్ని పనులకు, శంకుస్థాపనలు చేశారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజన మెనూ తీరును పరిశీలించి విద్యార్థులతో కలిసి రాగి జావ సేవించారు.
