TEJA NEWS

ఈ ప్రభుత్వాన్ని మేము పడగొట్టడం ఏంటి? మాజీ మంత్రి కేటీఆర్

బంగ్లాదేశ్ లాగా ప్రజలే పడగొడతారు!

హైదరాబాద్:
ఆర్ఆర్ ట్యాక్స్ అని, హెచ్ సీయూలో ఏదో జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం కాదు.. సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు..

HCUలోకి బుల్డోజర్లను పంపి తెలంగాణ ప్రభుత్వం ఆగమాగం చేస్తోందని మోదీ మాట్లాడారు.. ఎప్పు డో ఒకసారి మాట్లాడటం కాదు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది..? మోదీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు జడ్జితో ఇండిపెండెంట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గురు వారం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

అధికార మదంతో విర్రవీగి రారాజులం, నియంతలం అని భావిస్తే అది పొరపాటు. గచ్చిబౌలి హెచ్ సీయూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజా స్వామ్యాన్ని కాపాడాయి.. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగేలా జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు.

ఆత్మాభిమానం ఉన్న ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి,కాబట్టి దులుపుకొని పోతున్నాడు అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికుల విజయం. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి ధన్య వాదాలు. మా వాదనను సమర్థిస్తూ సెంట్రల్ ఎంపవర్డ్ రిపోర్టు లో పేర్కొందని కేటీఆర్ అన్నారు.

విజయం తేలేదాక తాకట్టు పెట్టడానికి, లీజుకు ఇవ్వరాదని రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది. ఆర్థిక అవకవతవలపై ఏజెన్సీల తో విచారణ చేయాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సుప్రీంకోర్టుకు ఇచ్చినా నివేదికలో తెలిపిందని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి మూటలు వెళ్తున్నాయి.. అందుకే హెచ్ సీయూ వ్యవహారంలో రాహుల్ గాంధీ నోరు మెదపరంటూ కేటీఆర్ విమర్శించారు.

జస్టిస్ గవాయ్ మీద కూడా రేవంత్ రెడ్డి, కేసుపెడతారే మో అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.కొంత మంది పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా, ముఠాలా వ్యవహరిస్తు న్నారు. ట్వీట్లు, రీట్వీట్లు చేస్తే కేసులు పెడుతున్నారు.

మా మీటింగ్ తర్వాత ఢిల్లీ వెళ్లి విచారణ సంస్థలను కలుస్తాం. మోదీ స్పందించకపోతే బీజేపీకి భాగస్వామ్యం ఉందని అనుకోవాల్సి వస్తుంది అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు నోరెందు కు మెదపడం లేదు. రేవంత్ రెడ్డి పిరికి సన్నాసి.. ఇది పిరికి ప్రభుత్వం అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పడగొట్టుడు ఏంది.. బంగ్లాదేశ్ లాగా ప్రజలే కూలగొడతారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ఖర్మ మాకేం పట్టలేదు. మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు.