TEJA NEWS

ఎండాకాలంలో ఉపాధి పనిచేసే రైతులకు తగు సూచనలు

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఎండిఓ ఆఫీస్ దగ్గర ఎంపీఓ రాజు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం పైన ప్రజలకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది, కల్వకుర్తి మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అందులో 9,309 జాబ్ కార్డు లో ఉన్నాయి, యాక్టివ్ జాబ్ కార్డులు 6000 ఉన్నాయి, 2024, 2025 సంవత్సరంలో 20వేల పని దినాలను పూర్తి చేయడం జరిగిందన్నారు, ఇట్టి పనులను ప్రతి సంవత్సరం చేపట్టడం జరుగుతుంది, ఈ సంవత్సరం కూడా చేపట్టడం జరిగింది, ఎండాకాలంలో ఉపాధి పని చేసే రైతులకు ఎండ నుండి తట్టుకోవడానికి టెంటు త్రాగునీరు ఇంకేమైనా ఆరోగ్య పరంగా కానీ ఇబ్బందికరంగా ఉన్నవారి కోసం అందుబాటులో ప్రాథమిక చికిత్స ఏర్పాటు చేయడం జరిగింది, 24 గ్రామపంచాయతీలో 24 నర్సరీలు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేశారు,

రోడ్డుకు ఇరువైపులా మొక్కలను పెంచడం కోసం డెకొము ఇతర తర మొక్కలు కూడా పెంచడం జరిగిందన్నారు, అంతేకాకుండా ఉపాధి హామీలో పని చేసే వ్యక్తులకు ఉదయాన్నే ఏడు గంటలకు పని ప్రదేశానికి వెళ్లి కనీసం 6 గంటలు చేస్తేనే మీకు రోజుకు 300 రూపాయల పడుతుంది, లేదా రెండు లేదా మూడు గంటలు మీరు పనిచేస్తే తక్కువ వేతనం పడుతుంది, కాబట్టి సకాలంలో ఉపాధి పని పూర్తి చేసుకోగలరని ఆయన కోరారు అదేవిధంగా, గత సంవత్సరంలో చేసిన ఉపాధి పని వారికి ఫిబ్రవరి మాత్రమే పెండింగ్ ఉంది, అవి కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని ఎంపీ ఓ రాజు తెలిపారు.