
పేదల కడుపు నింపేందుకు సన్నబియ్యం పంపిణీ..
గారిబోళ్ల ఆరోగ్యం,ఆత్మగౌరవం పెంచిన కాంగ్రెస్ సర్కార్..
పేదలకు పెద్ద దిక్కుగా దేశానికి మార్గదర్శిగా తెలంగాణ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమం…
కడుపు నిండా బువ్వ పెట్టిన రేవంత్ ను నిండు మనసుతో ఆశీర్వదించాలి : నీలం మధు ముదిరాజ్
ముత్తంగిలో దళితుల ఇంట్లో రేషన్ బియ్యంతో భోజనం…
ఆప్యాయంగా భోజనం పెట్టిన దళిత సోదరుడు విఠల్ కుటుంబాని శాలువాతో సత్కరించిన నీలం..
పేదింటి బిడ్డలు పస్తులుండకుండా ప్రతి పెదోడి కడుపు నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగిలో దళిత సోదరుడు సాదుల విఠల్ గారి ఇంట్లో రేషన్ సన్న బియ్యంతో వండిన భోజనం వారి కుటుంబసభ్యులతో కలిసి చేశారు. ఈ సందర్భంగా సన్నబియ్యం పంపిణీ తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న పాలనపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి ఆ కుటుంబ సభ్యులతో పాటు చుట్టూ పక్కల ప్రజలు సానుకూలంగా సమాధానం చెప్పి ఇందిరమ్మ పాలన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ ద్వారా గరీబోళ్ల కడుపు నింపడంతో వారికి ఆరోగ్యంతో పాటు ఆత్మ గౌరవం పెరిగిందన్నారు. సన్నబియ్యం పంపిణీతో సంపన్నులు తినే ఆహారాన్ని పేదలకు సైతం అందిస్తున్నామన్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీతో అన్నం తినలేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడేవారని మరొకపక్క దొడ్డు బియ్యం పక్కదోవ పట్టి దళారుల దందాకు ఉపయోగపడేవన్నారు. అందుకే నిరంతరం పేదల సంక్షేమం అభివృద్ధి కోసం ఆలోచించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి పేద బిడ్డ కడుపు నింపాలనే తలంపుతో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాలన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు పెద్దదిక్కుగా దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నాయని కొనియాడారు. అందుకు సన్న బియ్యం పంపిణీతో పాటు సబ్సిడీ ద్వారా 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్, పేదల ఇండ్లకు ఉచిత విద్యుత్ తో పాటు ఇందిరమ్మ ఇండ్లు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను ఉదహరించారు.
గత పది ఏళ్ల కేసీఆర్ పాలనలో దివాలా తీసిన తెలంగాణను ఒకవైపు గాడిలో పెడుతూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ సర్కార్ ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమం అందేలా పాలన కొనసాగిస్తుందన్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని విడతలవారీగా అమలు చేసే విధంగా సర్కార్ ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతుందన్నారు.
నిరంతరం పేదోడి సంక్షేమం కోసం ఆలోచిస్తు కడుపునిండా బువ్వ పెట్టి, వారి ఆర్థిక అభ్యున్నతికి సంక్షేమ పథకాల అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సి ప్రభాకర్ రెడ్డి, ముత్తంగి మాజీ ఎంపీటీసీ గడ్డ యాదయ్య, నాయకులు తూర్పు శ్రీను,అశోక్,సన్నీ యాదవ్,శంకర్, దశరథ్, వెంకటేష్,శ్రీను,ప్రవీణ్, కాళిదాస్, రాజు,బాలరాజు, శ్రీకాంత్,యాదయ్య,శ్రీ రామ్, సోమేష్,సత్యా నారాయణ, దత్తు, నందు, కార్యకర్తలు, విఠల్ కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
