
పజ్జురు ఐకెపి కేంద్రాన్ని సందర్శించిన ప్రాజెక్టు డైరెక్టర్
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జురు ఐకెపి కేంద్రంలో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ధాన్యం తూకం వేస్తున్నారని వచ్చిన సమాచారంతో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వై.అశోక్ రెడ్డి స్పందించి మండల ఐకెపి ఏపీఎం ఇతర సిబ్బందితో కలిసి కేంద్రాన్ని సందర్శించారు.
పత్రికలో వచ్చిన రీతిగా అక్కడ జరుగుతున్న పరిస్థితులపై ఆరా తీసినట్లు ఆయన తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం మహిళా సంఘ సభ్యులు మాత్రమే నిర్వహించాలని పురుషులు కేంద్రాల్లో తల దూర్చొద్దని ఆయన ఐకెపి నిర్వాహకులకు తెలిపారు. కేంద్రంలో ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు గ్రామ పెద్దల సమక్షంలో హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు తనకు ఫోన్ చేయాలని తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతిరోజు ఐదు, ఆరు కేంద్రాలను సందర్శిస్తు న్నామని ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్న వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆయన వెంట సంబంధిత శాఖ అధికారులు గ్రామ పెద్దలు ఐకెపి నిర్వాహకులు ఉన్నారు.
