TEJA NEWS

హన్విత్ మాడ్యులర్ ఫ్యాక్టరీ హోమ్ ఇంటీరియర్స్ వారు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై వాహనదారులకు మజ్జిగ అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ హన్విత్ ఫ్యాక్టరీ యజమాని సతీష్ గౌడ్ మంచి కార్యక్రమం చేస్తున్నారని అభినందించారు. ఎండలో రోడ్డుపై వెళ్లే జనాలకు మజ్జిగ అందించి దాహం తీర్చడం గొప్ప సేవా కార్యక్రమం అని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని చల్లటి బట్టర్ మిల్క్ సేవిస్తూ ఎండ తాకిడి నుండి ఉపశమనం పొందాలని తెలియచేసారు. కార్యక్రమంలో అంజయ్య యాదవ్, నాగేష్ గౌడ్, రవీందర్, నిర్వాహికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు