
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న BRS పార్టీ రాజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ స్థాయి BRS పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం KCR నాయకత్వంలో పుట్టిన BRS పార్టీ అన్నారు. BRS పార్టీ ఆవిర్భవించి ఈ నెల 27 వ తేదీ నాటికి 25 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో అదే రోజున వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. 27 వ తేదీన అన్ని డివిజన్ లలో గులాబీ జెండాలు, తోరణాలతో అలంకరించి పార్టీ జెండాలను ఎగురవేసి పార్టీ పండుగను ఘనంగా నిర్వహించాలని చెప్పారు. జెండా ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభకు బయలు దేరాలని అన్నారు. పార్టీ అన్ని స్థాయిల నాయకులు సమన్వయంతో వ్యవహరించి పెద్ద సంఖ్యలో హాజరై చరిత్రలో నిలిచిపోయే విధంగా సభను విజయవంతం చేయాలని కోరారు. సభకు వెళ్లేందుకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండేందుకు RTC బస్సులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.
