TEJA NEWS

భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు 
జిల్లా వ్యాప్తంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు 

నాగర్ కర్నూల్ జిల్లా
కల్వకుర్తి పట్టణంలోని వర్క్ వర్కాంటిన్ మెమోరియల్ చర్చ్ లో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. క్రైస్తవులు క్రీస్తు మరణాన్ని స్మరించుకుంటూ 40 రోజులుగా ఉపవాస దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు క్రీస్తు మరణాన్ని గుర్తు చేసుకుంటూ చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ రెవరెండ్ జేబీ రాజు మానవాళి కోసం యేసు ప్రభు చేసిన కృషి త్యాగాలను క్రైస్తవ సోదరి సోదరులకు వివరించారు. క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు క్రైస్తవ మార్గములో నడుస్తున్న వారికి ఎన్నో ఆధ్యాత్మిక ‌ సత్యాలను నేర్పిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ సత్యమార్గాన్ని అలవర్చుకోవాలన్నారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మనిషి చనిపోయేంత వరకు ఏసుప్రభు బోధనలను స్మరించుకుంటూ సమాజానికి ప్రజలకు ఎలా ఉపయోగకరంగా ఉండాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జోహార్న వైస్ చైర్మన్ స్టీవెన్ సన్, సెక్రటరీ రామస్వామి, జాయింట్ సెక్రటరీ, జగదీష్, ఇజ్రాయిల్, సురేష్ బాబు, ఇంజమూరి రాజు, ప్రేమ్, విజయ్ కుమార్, బొల్లె రాజు, యూత్ చైర్మన్ నేరటి రవి, సెక్రటరీ ఆనంద్, యూత్ వైస్ చైర్మన్, జ్యోతి ప్రసాద్, ఆనంద్ కుమార్, ఎంబి  వార్కంటి న్ మెమోరియల్ చర్చ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.