TEJA NEWS

25వ వార్డుకు చెందిన 200 మంది టిడిపి కార్యకర్తలు….. కార్మిక కుటుంబాలు వైఎస్ఆర్సిపిలో చేరిక….

-టిడిపి కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి…. వైఎస్ఆర్సిపిలో ఆహ్వానించిన పార్టీ నాయకుడు కొడాలి చిన్ని…. పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను

-జగన్‌కు ఓటేస్తే ఈ మంచి అంతా కొనసాగుతుంది.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలుకుతారన్న నాయకులు…..

గుడివాడ : గుడివాడ పట్టణం 25 వ వార్డుకు చెందిన టిడిపి కార్యకర్తలు,కార్మిక నేత భక్తుల దుర్గారావు ఆధ్వర్యంల పెద్ద ఎరుకపాడు, కార్మిక నగర్, వడ్డేర సంఘం, రైలుపేట,వాంబే కాలనీ, పాటిమీద, చెంచుపేట ఏరియాలకు చెందిన పలువురు కార్మికులు వైఎస్ఆర్సిపిలో చేరారు. గుడివాడ ఏలూరు రోడ్డు లోని పార్టీ ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు మరియు కార్మిక సోదరులకు వైసిపి నాయకుడు కొడాలి చిన్ని, పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను పార్టీ కండువాలు కప్పి వైసిపిలో వచ్చే ఆహ్వానించారు. ఈ సందర్భంగా గొర్ల శ్రీను మీడియాతో మాట్లాడుతు చంద్రబాబుది అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే నైజమని, అందుకే మోడీని తిట్టిన నోటితోనే ఇప్పుడు జైకొడుతున్నాడని అన్నారు. మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు చెప్తున్న మాయమాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయన్నారు. ప్రజలు అదే విశ్వాసంతో సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారని… ఎన్నికల్లో కొడాలి నాని భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని గొర్ల శ్రీను పేర్కొన్నారు.

ఎన్నికల పోలింగ్ లో ప్రజలందరూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కి ఎమ్మెల్యేగా కొడాలి నానిను…. ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను భారీ మెజార్టీలతో గెలిపించాలని గొర్ల శ్రీను పిలుపునిచ్చారు. ఓర్సు రాములు, ఓర్చు వెంకన్న, ఓర్సు సీనమ్మ, జానీ,సుల్తాన్, సమీర్, క్రీస్తు రాజు, సాయి, మురళి, ఎలియా ,ఎలీషా, ఓర్సు నాగేంద్రమ్మ, మా లక్ష్మి, ఏడుకొండలు, కొండ, బత్తుల నాగరాజు, ఏసుబాబు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అడపా జగదీష్,దుడ్డు చిన్నా,మేండా చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS