
హత్య ప్రయత్నం కేసులో ఏడు గురికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష
చిలకలూరిపేట రూరల్ :యడ్లపాడు మండలం తిమ్మాపురంలో 2021 జూలై 30న జరిగిన సంఘటన తాలూకు విచారణ చేసిన న్యాయస్థానం హత్యాప్రయత్నంగా పరిగణిస్తూ 7గురు ముద్దాయిలకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సోమవారం పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. యడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 148/201 కింద, సెక్షన్ 307, 324, 323, 506 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ ప్రకారం హత్య ప్రయత్నం కేసు నమోదు చేయబడింది. అప్పటి సబ్–ఇన్సె్పక్టర్ పి. రాంబాబు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేశారు. బాధితుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. బుట్చిదంతాచారి వాదనలు వినిపించారు. నరసరావుపేట ప్రిన్సిపాల్ సెషన్ జడ్జి మధుస్వామి వాదోపవాదాలను విన్న తర్వాత, 7 మంది ముద్దాయిలకు 4 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ. 1000/– జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించనట్లయితే అదనంగా మరో నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
