
ఏపీలో వడదెబ్బతో మరణించిన వారికి రూ.4 లక్షల నష్టపరిహారం: మంత్రి అనిత
అమరావతి : ఏపీ హోంమంత్రి అనిత మంగళవారం సీడీఎంఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వడగాల్పులతో మృతి చెందిన వారికి రూ.4 లక్షల నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రజలకు ఎండలు, వడగాల్పులపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీడీఎంఏ డైరెక్టర్ మాట్లాడుతూ.. తాగునీటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉన్నామని, వంద రోజుల యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నట్లు తెలిపారు
