
నాడు IPS.. నేడు IAS.
సివిల్స్ లో 15వ ర్యాంకు సాధించిన బాన్న వెంకటేష్
జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన బాన్న వెంకటేష్ 2023 సివిల్ సర్వీస్ 467 ర్యాంక్ సాధించి IPSకు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నాడు. ఐతే IAS కావాలనే సంకల్పంతో వెంకటేశ్ మరల సివిల్స్ పరీక్షలు రాశాడు. మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 15వ ర్యాంక్ తో IAS సాధించాడు. దీంతో వెంకటేశ్ తల్లిదండ్రులు చందర్రావు, రోహిణి అనందం వ్యక్తం చేశారు.
