TEJA NEWS

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, హేయమైన చర్యగా భావిస్తున్నాం,28 మంది పర్యాటకుల మృతి అత్యంత బాధాకరం.

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు మూడు రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తున్నాం.

అనంతపురము జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం సప్తగిరి సర్కిల్లో కొవ్వొత్తుల ర్యాలీతో మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థన చేయడం జరిగింది.మృతుల కుటుంబాలకు, తీవ్రవాదుల దాడిలో గాయపడిన వారికి జనసేన పార్టీ తరపున సంపూర్ణ సంఘీభావం తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అనంతపురం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు,జిల్లా కార్యదర్శిలు శ్రీ సంజీవ రాయుడు, శ్రీ కిరణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శిలు శ్రీమతి.జయమ్మ, నగర ఉపాధ్యక్షుడు శ్రీ జక్కి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శిలు శ్రీ మేదర వెంకటేష్, నగర కార్యదర్శులు శ్రీ విశ్వనాథ్, శ్రీ కుమ్మర మురళి, శ్రీ లాల్ స్వామి, నగర సహాయ కార్యదర్శి శ్రీ నెట్టికంటి హరీష్, శ్రీ మంగళ కృష్ణ, కార్యక్రమాల కమిటీ సభ్యుడు శ్రీ సంతోష్ మరియు వీరమహిళలు శ్రీమతి.అనసూయ, శ్రీమతి.మంజుల, శ్రీమతి.శరణ్య, నాయకులు శ్రీ చిరు, శ్రీ వెంకట సాయి, శ్రీ బళ్లారి అనిల్, శ్రీ హిద్ధూ, శ్రీ ప్రసాద్, శ్రీ హరి, శ్రీ వంశీ, శ్రీ అనిల్, శ్రీ మంజు తదితరులు పాల్గొన్నారు.